YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ప్రతి 4 నెలలకు ఒక కమిషనర్...

 ప్రతి 4 నెలలకు ఒక కమిషనర్...

హైదరాబాద్, ఏప్రిల్ 30, 
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్….దేశంలోనే పెద్ద కార్పొరేషన్లలో ఒకటి. వేలాది కోట్ల రూపాయల బడ్జెట్. కోటి మందికి పైగా జనాభా. అలాంటి కార్పొరేషన్ లో పథకాలు అమలు చేయాలన్నా…ప్రాజెక్టులు టేకప్ చేయాలన్నా..పనులు-ప్రాధాన్యతలు-అవసరాలను బట్టి చేపట్టాలన్నా వాటిపై ఉన్నతాధికారులకు సరైన అవగాహన ఉండాలి.16నెలల్లో నలుగురు కమిషనర్లు…ఇదీ మన జీహెచ్ఎంసీ పరిస్థితి అన్న టాక్ తెలంగాణ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. హైదరాబాద్ నగరాభివృద్ధికి జీహెచ్ఎంసీ అనేది గుండెకాయ లాంటిది. అలాంటి జీహెచ్ఎంసీలో పట్టుమని 16నెలలు కూడా కాలేదు. అప్పుడే నలుగురు కమిషనర్లు మారారు. దీంతో నగరాభివ్రుద్ది కొంత కుంటుపడుతోందన్న టాక్ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. ఎందుకంటే జీహెచ్ఎంసీ 625 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన భారీ లోకల్ బాడీ. చావు పుట్టుకల లెక్కల నుండి మొదలుకొని వేలాది కోట్ల రూపాయల ప్రాజెక్టుల టేకప్ వరకు అనేక పనులు సిటిజన్స్ కు చేసి పెట్టాల్సిన సంస్థ.ఇలాంటి ముఖ్యమైన గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పోస్ట్ అంటే అంత ఆషామాషి కాదు. ఉదయం పారిశుద్ధ్యం నుండి మొదలుకొని రాత్రి స్ట్రీట్ లైట్స్ వరకు పనులన్నింటినీ చక్కబెట్టాలి. ఇలాంటి ముఖ్యమైన కార్పొరేషన్ లో అన్ని పనులను అధికారులతో సమన్వయంతో కలిసి ముందుకు తీసుకెళ్లాలి. ఒక్కమాటలో చెప్పాలంటే బల్దియా బాస్..ఆల్ ఇన్ వన్ అని చెప్పాలి. అయితే జీహెచ్ఎంసీకి వస్తున్న అధికారులు ముచ్చటగా మూడు-నాలుగు నెలలు కాకముందే సీటు మారడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.2023 సాధారణ ఎన్నికల కంటే కొద్ది నెలల ముందే జీహెచ్ఎంసీకమిషనర్ గా వచ్చిన రోనాల్డ్ రోస్ ను ఎన్నికలు పూర్తైన తర్వాత ఏడు నెలల్లోనే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. ఆ స్థానంలో అమ్రపాలి కాటానుగా నియమించింది. రెండు నెలలు ఇంచార్జిగా కొనసాగించి ఆ తర్వాత పూర్తిస్థాయిలో మరో రెండు నెలలు అవకాశం కల్పించింది.అమ్రపాలి కేవలం 4 నెలలు మాత్రమేజీహెచ్ఎంసీ కమిషనర్ గా పనిచేశారు. ఆ తర్వాత ఆమె ఏపీకి వెళ్లిపోవడంతో ఆమె స్థానంలో ఇలంబర్తిని గ్రేటర్ కమిషనర్ గా నియమించింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీలో రిపోర్టు చేసే కంటే ముందే జార్ఖండ్ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ కేటాయించడంతో ఝార్ఖండ్ నుండే నెల రోజులపాటు గ్రేటర్ పరిస్థితిని చక్కబెట్టారు జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఉన్న ఇలంబర్తి. 2024 నవంబర్ 14 నుండి పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకున్న ఇలంబర్తి..కేవలం 5 నెలల్లోనే మళ్లీ ట్రాన్స్ ఫర్ అయ్యారు. ఇప్పుడు ఇలంబర్తి స్థానంలో ప్రభుత్వం ఆర్ వి కర్ణన్ నుజీహెచ్ఎంసీ నూతన బాస్ గా నియమించింది.జీహెచ్ఎంసీపై పట్టు సాధిస్తున్న తరుణంలో ఈ విధంగా 4నెలలోకోసారి కమిషనర్లను మార్చడంతో పాలన గాడి తప్పుతుందన్న వాదనలు గ్రేటర్లో వినిపిస్తున్నాయి. మొదట్లో రోనాల్డ్ రోస్ జిహెచ్ఎంసిపై పట్టు సాధించి అనేక పనులను వేగంగా కంప్లీట్ చేసే తరుణంలోనే ఆయన ట్రాన్స్ ఫర్ కాగా…తాజాగా ఇలంబర్తి కూడా బదిలీ కావడం చూస్తుంటే బల్దియా పాలన ఏడాది కాలంగా మూడు అడుగులు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైందిఇటీవల కాలంలో జిహెచ్ఎంసిలోని అనేక అక్రమాలపై ఫోకస్ చేశారు ఇలంబర్తి. ఉన్నతాధికారులందరూ పనుల్లో ఉండేటట్లు ఆయా విభాగాల్లో ఉన్న లోపాలను గుర్తించి వేగంగా సిటిజన్స్ కు సేవలు అందేలా ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్క విభాగంలోని లోపాలను గుర్తించి వాటిలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణలు కూడా చేయించారు. ఇంజనీరింగ్ విభాగంలో పలు సర్కిళ్లలో పనులు కాకుండానే బిల్లులు చెల్లించారన్న ఆరోపణలపై విచారణ జరిపించారు.అందులో కొన్ని అంశాల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన కమిషనర్..చర్యలకు ఉపక్రమించే తరుణంలోనే తాజాగా ట్రాన్స్ ఫర్ అయ్యారు. బర్త్ అండ్ డెత్..మలేరియా విభాగంలో కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయించి ప్రాథమికంగా కొన్ని చర్యలు తీసుకున్నారు. ఇక పన్నుల వసూళ్లలోనూ..ఫిర్యాదులు అందడంతో వాటిని కూడా పరిష్కరించి వ్యవస్థను గాడిన పెట్టారు ఇలంబర్తి. అందువల్లే ఈ ఏడాది 2వేల,40 కోట్ల రూపాయల ఆస్తి పన్నును వసూలు చేసి రికార్డును క్రియేటర్ చేసింది జీహెచ్ ఎంసీ.రోనాల్డ్ రోస్, అమ్రపాలి…తాజాగా ఇలంబర్తి..జీహెచ్ ఎంసీ కమిషనర్లుగా పాలనపై ఫోకస్ పెట్టి తమదైన ముద్ర వేసే సమయంలోనే వారిని మార్చి వేస్తుండడం కారణంగా బల్దియా పాలన గాడిన పరిస్థితి లేకుండా పోయింది. అయితే ఇలా వరుసగా కమిషనర్లు మారడం వెనుక ప్రజాప్రతినిధుల హస్తం ఉందన్న చర్చ సాగుతోంది. మరి ఇప్పటివరకు మారిన ముగ్గురు అధికారులు కూడా ముక్కుసూటిగా వ్యవహరిస్తారన్న పేరుంది. జీహెచ్ఎంసి మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు…ఇలా ఎవరు చెప్పినా ఎన్ని ఒత్తిళ్లు చేసినా నిబంధనల ప్రకారమే వీరంతా నడుచుకున్నారు.మేయర్ కార్యాలయంలో పనిచేసే రిటైర్డ్ ఉద్యోగుల ఎక్స్ టెన్షన్ విషయంలోనూ…లిమిట్ కు మించి చేసిన బిల్లుల చెల్లింపుల్లోనూ కమిషనర్లందరూ చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరించారని బల్దియాలో టాక్. ఇక ఉద్యోగుల ట్రాన్స్ ఫర్స్ విషయంలోనూ…నిబంధనలు పాటించని నిర్మాణాల ఆక్యుపెన్సీవ్ సర్టిఫికెట్ల జారీ చేసే విషయంలోనూ నగర ప్రజా ప్రతినిధుల మాటలు భే ఖాతరు చేశారన్న వాదనలు ఉన్నాయి. మేయర్ కార్యాలయంతో పాటు ప్రజా ప్రతినిధుల విషయంలో కొనసాగిన గ్యాప్ వల్లే కమిషనర్లు మారుతున్నారా అనే అంశానికి బల్దియా ప్రధాన కార్యాలయంలో అవుననే సమాధానం వస్తుందన్న టాక్ విన్పిస్తోంది.అయితే త్వరలోనే జీహెచ్‌ఎంసీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో ముక్కుసూటిగా ఉండే ఇలంబర్తిని ట్రాన్స్ ఫర్ చేసి.. ఆర్వీ కర్ణన్ ను నూతన కమిషనర్ గా నియమించడం వెనుక ఏదో మర్మం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది.

Related Posts