
హైదరాబాద్, మే 3,
హైదరాబాద్ మెట్రో రెండో దశ ‘బి’ భాగంగా జేబీఎస్ నుండి మేడ్చల్ (24 కి.మీ.), జేబీఎస్ నుండి శామీర్‌పేట (21 కి.మీ.), శంషాబాద్ విమానాశ్రయం నుండి ఫ్యూచర్ సిటీ (40 కి.మీ.) వరకు మూడు కీలకమైన మెట్రో మార్గాల సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. ప్రస్తుతం హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డు ఆమోదం కోసం ఎదురుచూస్తోంది. ఆమోదం తర్వాత రాష్ట్ర మంత్రివర్గం చర్చించి కేంద్రానికి పంపుతుంది. జేబీఎస్ వద్ద ప్రపంచ స్థాయి మెట్రో హబ్‌ను అభివృద్ధి చేయాలని కూడా ప్రతిపాదన ఉంది.. దీని రూపకల్పన జపాన్‌లోని రవాణా వ్యవస్థను స్ఫూర్తిగా తీసుకుంటుంది.హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్ట్ తన రెండో దశ విస్తరణకు వేగంగా అడుగులు వేస్తోంది. రెండో దశ ‘బి’లో భాగంగా ప్రతిపాదించిన కీలకమైన మార్గాల సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. ఈ డీపీఆర్‌ను హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ బోర్డు ఆమోదించాల్సి ఉంది. బోర్డు ఆమోదం తర్వాత.. రాష్ట్ర మంత్రివర్గం దీనిపై చర్చించి ఆమోదం తెలుపుతుంది. అనంతరం.. తుది అనుమతి కోసం డీపీఆర్‌ను కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు.రెండో దశ ‘బి’లో హైదరాబాద్ నగరంలోని ఉత్తర ప్రాంతాలకు మెట్రో అనుసంధానాన్ని విస్తరించేందుకు ముఖ్యమైన ప్రతిపాదనలు ఉన్నాయి. ఇందులో జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) నుండి మేడ్చల్ వరకు 24 కిలోమీటర్ల మేర ఒక మార్గం, అలాగే జేబీఎస్ నుండి శామీర్‌పేట వరకు 21 కిలోమీటర్ల మేర మరొక మార్గం ప్రతిపాదించబడ్డాయి. వీటితో పాటు.. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి ఫ్యూచర్ సిటీ వరకు దాదాపు 40 కిలోమీటర్ల పొడవైన మెట్రో మార్గం యొక్క డీపీఆర్‌ను కూడా సిద్ధం చేశారు.
విమానాశ్రయం నుండి ఫ్యూచర్ సిటీకి వెళ్లే మెట్రో మార్గం ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ నుండి ప్రారంభమై.. కొత్తగా ప్రతిపాదించిన మెట్రో రైలు డిపో పక్కనుంచి.. విమానాశ్రయ సరిహద్దు గోడ వెంబడి ఆకాశ మార్గంలో కొనసాగుతుంది. ఇది మాన్సాన్‌పల్లి, బహుదూర్‌గూడ, పెద్ద గోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ఎగ్జిట్, తుక్కుగూడ ఎగ్జిట్, రావిర్యాల్ ఎగ్జిట్ వరకు సర్వీస్ రోడ్డులో వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు. అక్కడి నుండి, ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ రహదారి ద్వారా కొంగరకలాన్, లేమూర్, తిమ్మాపూర్, రాచలూరు, గుమ్మడవెల్లి, పంజగూడ , మీర్‌ఖాన్‌పేట వరకు దాదాపు 22 కిలోమీటర్ల మేర ఈ మార్గం విస్తరించనుంది.ఈ డీపీఆర్‌ను మొదట హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్) బోర్డు ఆమోదించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ బోర్డుకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇందులో ఎండీతో పాటు పురపాలక, పట్టణాభివృద్ధి, ఆర్థిక, పరిశ్రమలు, ఐటీ శాఖల కార్యదర్శులు మరియు హెచ్‌ఎండీఏ కమిషనర్ డైరెక్టర్లుగా ఉంటారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు.. జేబీఎస్ వద్ద 30 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి మెట్రో హబ్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రితో పాటు జపాన్ పర్యటనకు వెళ్లిన మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, అక్కడి అనుభవాలను ఈ మెట్రో హబ్‌లో పొందుపరిచేందుకు కృషి చేస్తున్నారు. జపాన్‌లో బుల్లెట్ రైళ్లు, మెట్రో , సాధారణ రైలు సదుపాయాలు ఒకదానితో మరొకటి అనుసంధానించబడి ఉంటాయి. ప్రయాణికులు ఒక రైలు నుండి మరొక రైలుకు సులభంగా మారేలా ఈ వ్యవస్థ రూపొందించబడింది. ఇదే తరహా అనుసంధాన వ్యవస్థను జేబీఎస్ మెట్రో హబ్‌లో కూడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.
వివరాలు పంపించండి... కిషన్ వినతి
నగరంలో మెట్రోరైలు విస్తరణ కోసం వెంటనే ప్రతిపాదనలు పంపించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆదేశించారు. కేంద్రమంత్రి ఆధ్వర్యం లో శుక్రవారం ఎంసీహెచ్ హెచ్‌ఆర్డీలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. కేంద్రనిధులతో జరుగుతున్న కార్యక్రమాలపై కేంద్రమంత్రి ప్రత్యేకంగా సమీక్ష నిర్వ హించారు.మెట్రోరైలు ప్రాజెక్టులో అఫ్జల్‌గంజ్ వరకే పరిమితమైన ఫస్ట్ ఫేజ్ ను విస్తరించి..సెకండ్, థర్డ్, ఫోర్త్ ఫేజ్‌ల కోసం ప్రతిపాదనలు వెంటనే కేంద్రప్రభుత్వానికి పంపించాలని సూచిస్తున్నట్లు తెలిపారు. మెట్రోరైలు వివరాలు అందితే కేంద్రప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు, రుణాలు లభించేలా సహకరిస్తామని స్పష్టం చేశారు.రాష్ర్ట అభివృద్ధిలో మొదట ప్రతిబింబించేది హైదరాబాద్ సిటీ అని.. అభివృద్ధి అంటే కేవలం హైటె క్ సిటీ కాదని.. ఓల్డ్ సిటీ, గౌలిగూడ, అం బర్‌పేట్, సనత్‌నగర్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ వంటి ప్రాంతాలూ కీలకమని అన్నారు. హైదరాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, పాతబస్తీ ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరత, ప్రాథమిక సౌకర్యాల సమస్యలు మరింతగా తలెత్తుతున్నాయని..హైటెక్ సిటీతో పా టు ఓల్డ్‌సిటీ అభివృద్ధిపై సమాన దృష్టితో ముందు కు సాగాల్సిన అవసరం ఉందన్నారు. జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్ సంస్థలు నగర మౌలిక వసతుల కల్పనలో కీలకపాత్ర పోషిస్తున్నాయని, నిధుల కొరత లేకుండా చూ సేందుకు చర్యలు తీసుకోవాలన్నా రు. జీహెచ్‌ఎంసీ ఊహించని స్థాయి లో విస్తరిస్తూ జనాభా భారీగా పెరుగుతున్న నేప థ్యంలో మౌలికవ సతులపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందన్నారు. కేంద్రం ప్రవేశపెట్టే పథకాలకు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను కేటాయించకపోవడం వల్లే నిధులు ఖర్చు చేయ లేని దుస్థితి ఏర్పడుతోందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. అధికారులు రాష్ట్రంలోని సమస్యలను తమ దృష్టి కి తీసుకువస్తే కేంద్రం నుంచి ఎన్ని నిధులై నా తీసుకువస్తామని తెలిపారు.