
పద్మశ్రీ వనజీవి రామయ్య కు వందనం పేరుతో వాస్విక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ఎల్.వి.ప్రసాద్ స్టూడియోలో కృతజ్ఞత సభ జరిగింది. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు, సీనియర్ ఐఏఎస్ అధికారి నరహరి గారు, సివిల్ సర్వీస్ కోచింగ్ నిర్వాహకురాలు బాలలత గారు, ఐ న్యూస్ డైరెక్టర్ గటిక విజయ్ కుమార్, ప్రముఖ విశ్లేషకులు వి ప్రకాష్ గారు, ప్రముఖ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ గారు, ఫౌండేషన్ అధ్యక్షులు నవీన్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.