YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఆ ఫోన్లకు వాట్సప్ బంద్...

ఆ ఫోన్లకు వాట్సప్ బంద్...

హైదరాబాద్, మే 6, 
ప్రస్తుత కాలంలో ప్రతి మొబైల్ లో వాట్సాప్ తప్పనిసరిగా ఉంటుంది. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ వాట్స్అప్ ద్వారా చాటింగ్ చేస్తూ ఉన్నారు. వినియోగదారులకు అనుగుణంగా వాట్సాప్ మాతృ సంస్థ అయినా మెటా ఎప్పటికప్పుడు ఈ యాప్ ను అప్డేట్ చేస్తూ ఉంటుంది. కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూ.. పాత వాటిలో ఉన్న ఇబ్బందులను తొలగిస్తూ ఉంటుంది. అయితే తాజాగా వాట్స్అప్ విషయంలో మెటా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి కొన్ని ఫోన్లో మాత్రమే వాట్స్అప్ పనిచేయనుంది. మిగతా ఫోన్లో ఈ సేవలన నిలిపివేయనుంది.. వాట్సాప్ లేకుంటే జీవితమే నడవదు అన్నట్లుగా తయారైంది ప్రస్తుత రోజుల్లో. దాదాపు ప్రతి మొబైల్ లో వాట్సాప్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే వాట్సాప్ లేకపోతే పరిస్థితి వేరుగా ఉండే అవకాశం ఉంది. కానీ మే ఐదు నుంచి కొన్ని ఫోన్లలో మాత్రమే వాట్సాప్ పని చేయనుంది. కన్నా ముందు ఐఓఎస్ వర్షన్ ఉన్న ఐ ఫోన్లో వాట్స్అప్ పనిచేయదు. అలాగే ఐ ఫోన్ ఫైవ్ ఎస్, ఐఫోన్ 6 వాటిల్లో కూడా ఈ యాప్ కొనసాగదు. కేవలం ఐవోఎస్ 12.5 నుంచి 12.7 వరకు మాత్రమే పనిచేయగలరు. ఆయా ఫోన్లో ఇప్పటికే వాట్సాప్ యాప్ ఉన్న వాటిల్లో మెసేజ్లు, ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ ఎలాంటివి  పనిచేయవు అని మెటా సంస్థ తెలిపింది.మెటా సంస్థ తీసుకున్న నిర్ణయంతో ఆండ్రాయిడ్ మొబైల్ కు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఈ ఫోన్లో వాట్స్అప్ కొనసాగుతుంది. అయితే ఐఫోన్ కంటే ఆండ్రాయిడ్ మొబైల్స్ లోనే ఎక్కువగా వాట్సాప్ ను వినియోగిస్తారు. అంతేకాదు విద్యార్థులకు సమాచారం నుంచి.. ఉద్యోగులు, వ్యాపారులు వాట్సాప్ తోనే కార్యకలాపాలు సాగిస్తూ ఉంటారు. ఒకప్పుడు కేవలం మెసేజ్ పంపించుకునేందుకు మాత్రమే ఉపయోగపడే వాట్సాప్.. ఇప్పుడు ఏకంగా డబ్బులు కూడా ట్రాన్స్ఫర్ చేసేందుకు ఉపయోగపడుతుంది. హెచ్డి ఫొటోస్ నుంచి క్వాలిటీ వీడియోలు పంపించేందుకు వాట్సాప్ సహకరిస్తుంది.వాట్సాప్ ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని కొందరు సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు. ప్రైవసీ విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు. వాట్సాప్ మాతృ సంస్థ మెటా ప్రైవసీకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. అయినా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం అని సాంకేతిక నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే వాట్సాప్ లోనే నీటి కాలంలో సర్వ సమాచారం ఉంటుంది. కొన్ని పోలీస్ కేసుల్లో కూడా వాట్సాప్ చాటింగ్ ఉపయోగపడే అవకాశం ఉంది. అందువల్ల ఎలాంటి తప్పుడు పనులకు వాట్స్అప్ను ఉపయోగించవద్దని కొందరు తెలుపుతున్నారు. ఇదే సమయంలో తమ ఖాతాను ఎప్పటికప్పుడు కాపాడుకోవాలని పేర్కొంటున్నారు.

Related Posts