
హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ సినిమా 2024 అవార్డులు ప్రకటించారు. ఉత్తమ మొదటి చిత్రం కల్కి, ఉత్తమ రెండో చిత్రం పొట్టేల్, ఉత్తమ మూడో చిత్రం లక్కీ భాస్కర్, ఉత్తమ బాలల చిత్రం-35 ఇది చిన్న కథ కాదు, ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ అవార్డు-రజాకార్, ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప-2), ఉత్తమ దర్శకుడు - నాగ్ అశ్విన్ (కల్కి), ఉత్తమ నటి - నివేదా థామస్ (35 ఇది చిన్న కథ కాదు), ఉత్తమ గాయని - శ్రేయా ఘోషల్ (పుష్ప-2), ఉత్తమ స్క్రీన్ ప్లే-వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్), ఉత్తమ హాస్యనటులు - వెన్నెల కిషోర్, సత్య, ఉత్తమ కొరియోగ్రాఫర్ - గణేష్ ఆచార్య (దేవర), ఉత్తమ కథా రచయిత - శివ పాలడుగు, ఉత్తమ పుస్తకం - రెంటాల జయదేవ్ (మన సినిమా పుస్తకం), స్పెషల్ జ్యూరీ అవార్డు - అనన్య నాగళ్ల (పొట్టేల్). స్పెషల్ జ్యూరీ - దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్), స్పెషల్ జ్యూరీ - ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా-2).
జూన్ 14న హైటెక్స్‌లో అవార్డుల ప్రదానం వుంటుంది. 2014-23 సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను త్వరలో ప్రకటిస్తామని జ్యూరీ చైర్పర్సన్ జయసుధ అన్నారు.