YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో మరో నేషనల్ హైవేకు మహర్ధశ

ఏపీలో మరో నేషనల్ హైవేకు మహర్ధశ

విజయవాడ, జూన్ 24, 
ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా 216హెచ్ జాతీయ రహదారికి మోక్షం కలిగింది. పెడన-లక్ష్మీపురం మధ్య 120.85 కిలోమీటర్ల మేర నాలుగు వరుసల రహదారిని రూ.4245 కోట్లతో విస్తరించనున్నారు. ఈ హైవే గుడివాడ, హనుమాన్‌జంక్షన్, నూజివీడు మీదుగా లక్ష్మీపురం వరకు వెళ్తుంది. ఈ హైవే వల్ల పరిశ్రమలు అభివృద్ధి చెందడంతో పాటు వాహనాల రద్దీ కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ హైవేలకు సంబంధించి కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ క్రమంలో మరో హైవేకు మోక్షం కలిగింది. 216హెచ్ జాతీయ రహదారిలో పెడన-లక్ష్మీపురం మధ్య విస్తరించనున్నారు. ఈ 216హెచ్‌ రహదారి 120.85 కి.మీ మేర నాలుగు వరుసలుగా రూ.4245 కోట్లు కేటాయించారు. ఈ హైవే విషయానికి వస్తే.. పెడన నుంచి మొదలై.. 'గుడివాడ, హనుమాన్‌జంక్షన్, నూజివీడు, విసన్నపేట మీదుగా లక్ష్మీపురం' వరకు వెళ్తుంది. ఈ రహదారి విస్తరణ వల్ల పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని.. అలాగే వాహనాల రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు.ఈ నేషనల్ హైవే విస్తరణలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో 9 చోట్ల బైపాస్‌‌ను నిర్మించాలని ప్లాన్ చేశారు. గుడివాడలో 15.3 కిలోమీటర్ల మేర.. హనుమాన్‌జంక్షన్‌లో 12.5 కిలోమీటర్ల మేర.. గుడ్లవల్లేరులో 6.7 కిలోమీటర్ల మేర బైపాస్‌లు రానున్నాయి. అన్నవరంలో 2.9 కి.మీ మేర, పుట్టగుంటలో 2.4 కి.మీ చిన్న బైపాస్‌లు వస్తాయి. మొత్తం 54.6 కి.మీ మేర బైపాస్‌లు.. హనుమాన్‌ జంక్షన్‌లో రైల్వే లైన్ క్రాసింగ్ దగ్గర ఆర్వోబీ ప్లాన్ చేశారు. మరికొన్ని బ్రిడ్జిలు, కల్వర్టులు కూడా రానున్నాయి. ఈ మేరకు ఈ హైవేకు సంబంధించి అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారు. ఈ హైవేకు అన్ని అనుమతులు అయ్యాక పనులు మొదలవుతాయంటున్నారు అధికారులు. ఈ హైవే విస్తరణ కోసం 700 ఎకరాల భూమిని సేకరించాలని.. దీనికి రూ.500 కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. రెవెన్యూ అధికారులు భూమి ధరలను లెక్కించి.. ఆ తర్వాత దాని ప్రకారం పరిహారం అందజేస్తారు.ఈ నేషనల్ హైవేతో తెలంగాణకు, మచిలీపట్నం పోర్టుకు అనుసంధానం కూడా ఏర్పడుతుందని చెబుతున్నారు. ఖమ్మం నుంచి గ్రానైట్‌ను మచిలీపట్నం పోర్టుకు తరలించడం ఈజీగా ఉంటుందంటున్నారు. నూజివీడు మామిడి పండ్లను రవాణా అనుకూలంగా ఉంటుంది. ఈ హైవే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంగా వెళుతుంది.. దీంతో రాజధానికి కూడా జనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పోతుందంటున్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్‌కు కూడా ఉపయోగంగా ఉంటుంది. ఈ 216 హైవేుకు అనుసంధానంగా ఒంగోలు-కత్తిపూడి మధ్య ఆక్వా ఉత్పత్తులు, ఎగుమతులకు వీలుగా ఉంటుంది. డీపీఆర్ పూర్తి చేయడంతో అన్ని అనుమతులు రాగానే పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు.

Related Posts