
ఏలూరు, జూన్ 24
పెళ్లయి విడాకులు తీసుకున్నారా.. లేదా వివాహం కాలేదన్న డిఫ్రెషన్లో ఉన్నారా.. అయితే మీకు ఫోన్ ద్వారా కానీ, ఎవరైనా పెళ్లిళ్ల బ్రోకర్ల ద్వారా కానీ మీకు చక్కని అమ్మాయి ఉంది.. చాలా మంచిది.. చాలా అందంగా ఉంటుంది.. అంటూ చెబితే మీరు అమ్మాయి ఫోటోచూసి ఉబ్బితబ్బిబ్యయ్యి పోకండి.. ఇలా చాలా మందే ఇలా మోసపోయారు.. ఈ విషయం ఎవరో చెబితే పెద్ద విషయం కాదు కానీ స్వయంగా మోసపోయిన బాధితులే బాబోయ్ ఈ నిత్య పెళ్లి కూతురు వలలో పడి మోసపోయామని ఏకంగా జిల్లా ఎస్పీకే ఫిర్యాదు చేశారు.అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ కు నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు పట్టణాలకు చెందిన ముగ్గురు బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు. తమలాగ మరి ఎవరూ మోసపోకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసామన్నారు. నిత్య పెళ్లికూతురు కాజేసిన సొమ్మును తిరిగి తమకు ఇప్పించాలని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం గ్రామానికి చెందిన బేతి వీర దుర్గ నీలిమ, ఆమె తల్లి బేతి వీరలక్ష్మి, రామకృష్ణ, కళ్యాణ్ లు ఆర్థిక స్థిరత్వం కలిగి విడాకులు తీసుకున్న పురుషులను టార్గెట్ గా చేసుకుని మోసం చేస్తున్నారని ఇటీవలే పశ్చిమ గోదావరి జిల్లాలో కేసు నమోదయ్యింది.. అయితే ఈ కేసు విషయంలో న్యాయం కోరుతూ నిత్య పెళ్లికూతురిపై అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణరావుకు బాధితులు సోమవారం ఫిర్యాదు చేశారుతమ లాంటి వారిని మోసం చేసి 12 పెళ్లిళ్లు చేసుకుందని, ఆ తరువాత తమ వద్ద మొత్తం డబ్బు,బంగారం లాగేసి ఆపై సెక్షన్ 498 కేసులు పెట్టి వేధిస్తోందని వారంతా జిల్లా ఎస్పీ వద్ద వాపోయారు.. ఈ నిత్య పెళ్లికూతురు వలలో పడి మోసపోయిన తమకు న్యాయం చేయాలని వారు ఎస్పీకు విజ్ఞప్తి చేశారు..వైవాహిక జీవితంలో మనస్పర్థలు వచ్చో లేక మరే కారణం చేతనైనా విడిపోతే వారిలో చాలా మంది డిఫ్రెషన్‌లోకి వెళ్లిపోయి మానసికంగా ఇబ్బందులు పడుతుంటారు.. సరిగ్గా ఈ నిత్య పెళ్లికూతురుకు వీళ్లే టార్గెట్‌గా మారుతున్నారని బాధితులు వాపోయారు. విడాకులు తీసుకుని డిప్రెషన్ లో ఉన్న పురుషులకు మాయ మాటలు చెప్పి వివాహం వరకు తీసుకువెళతారని, ఈ లోపు వారి నుండి అందినకాడికి డబ్బును దోచుకుని, బాధితులు తిరగబడితే తప్పుడు కేసులు పెట్టి వేధించేవారన్నారు. ఈ విధంగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు చెందిన 12 మంది పురుషులను మోసం చేసి లక్షల్లో డబ్బులు వసూలు చేసుకుని పరారయ్యారని బాధితులు గొల్లు మన్నారు.. ఇటీవల నిత్య పెళ్ళి కూతురు బేతి వీర దుర్గా నీలిమపై కేసులు నమోదు కావడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. సోమవారం నరసాపురం, పాలకొల్లు, కొవ్వూరు పట్టణాలకు చెందిన ముగ్గురు బాధితులు జిల్లా ఎస్పీ కృష్ణారావును కలిసి ఫిర్యాదు చేశారు. తమలాగ మరి ఎవరూ మోసపోకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసామన్నారు. నిత్య పెళ్లికూతురు కాజేసిన సొమ్మును తిరిగి తమకు ఇప్పించాలని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. బయటకు వచ్చని వారు చాలా తక్కువేనని, పరువు కోసం చాలా మంది బయటకు రాకపోవడంతో నిత్యపెళ్లికూతురు, ఆమె కుటుంబం ఇదే పనిగా పెట్టుకుని ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటున్నారని వారు వాపోయారు.