YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అమ్మాయిలు అంత క్రూరంగా మారిపోతున్నారే...

అమ్మాయిలు అంత క్రూరంగా మారిపోతున్నారే...

చెన్నై, జూన్ 25, 
ఓ యువకుడిని చెన్నైకు చెందిన ఓ అమ్మాయి “వన్‌ సైడ్‌ లవ్‌” చేసింది. అయితే, ఆమె ప్రేమను అతడు ఒప్పుకోకపోవడంతో ఆ అమ్మాయి ప్రతీకారం తీర్చుకోవడానికి భారీ ప్లాన్‌ వేసింది. ఇందులో భాగంగా దేశంలోని 11 రాష్ట్రాలను కూడా భయపెట్టింది. చివరకు ఆమెను పోలీసులు అరెస్టు చేసి, వివరాలు తెలిపారు.రోబోటిక్స్‌ చదువుకుని డెలాయిట్‌ సంస్థలో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న రెని జోషిల్దా అనే యువతి..  డివిజ్ ప్రభాకర్ అనే యువకుడిని వన్ సైడ్ లవ్ చేసింది. 2025 ఫిబ్రవరిలో ప్రభాకర్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. దీంతో ప్రభాకర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని అతడి పేరుతో అనేక ఫేక్‌ ఈ-మెయిల్ అకౌంట్లు క్రియేట్ చేసింది. ఆ ఈ-మెయిల్‌ ఐడీలతో వివిధ ప్రాంతాకు ఆమె బాంబు బెదిరింపులు మెసేజ్‌లు పంపింది.ప్రభాకర్ పేరుతో జోషిల్దా పంపిన ఈ బెదిరింపులు దేశంలోని 11 రాష్ట్రాల్లో అలజడి రేపాయి. పబ్లిక్ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ పంపిన ఈ బెదిరింపులకు అనేక పోలీస్‌ విభాగాలు సంయుక్తంగా స్పందించాయి. బెదిరింపు ఈ-మెయిల్స్‌ ఎవరు పంపుతున్నారన్న విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. చివరకు అహ్మదాబాద్‌లోని సైబర్‌ క్రైం విభాగం జోషిల్దాను గుర్తించి అరెస్టు చేసింది.జోషిల్దా డార్క్ వెబ్‌ ద్వారా ఈ బెదిరింపు ఈ-మెయిల్స్‌ను పంపింది. దీంతో తనను ఎవరూ గుర్తుపట్టరని అనుకుంది. ఆ సమయంలో ఆమె చేసిన ఓ చిన్న తప్పిదంతో పోలీసులకు దొరికిపోయింది. చెన్నైలోని ఆమె లొకేషన్‌ను పోలీసులు ట్రేస్‌ చేసి పట్టుకున్నారు. పోలీసులు ఆమె వద్ద నుండి డిజిటల్ డేటా, పలు ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. తనను  ప్రేమించనందుకు ప్రభాకర్‌ను ఇరికించాలన్న ఉద్దేశంతోనే ఆమె ఈ చర్యలకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ మల్టీనేషనల్‌ కంపెనీలో సీనియర్‌ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్న మహిళా ఇంజినీర్‌ రెనె జోషిడానే.. గుజరాత్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించి ముప్పుతిప్పలు పెట్టింది. వరుస బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించి, ఆమెను అరెస్ట్‌ చేశారు. అయితే ఆమె పంపించిన ఈమెయిల్స్ నకిలీ ఇమెయిల్ ఐడీలు, వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లు (VPN), డార్క్ వెబ్‌ నుంచి వచ్చాయి. ఈ క్రమంలో బాంబు బెదిరింపులకు ఎందుకు పాల్పడ్డావని పోలీసులు ప్రశ్నించగా ఆమె చెప్పిన సమాధానం మరింత షాక్‌కు గురి చేసింది. తాను ప్రేమించిన విజయ్‌ ప్రభాకర్‌ అనే వ్యక్తి తనను మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడని, అతడిపై కక్ష సాధించేందుకే అతడి పేరుతో బాంబ్‌ బెదిరింపు ఈమెయిల్స్‌ పంపినట్లు జోషిడా తెలిపింది. బెదిరింపు మెయిల్స్‌ కేసులో అతడు ఇరుక్కుంటాడని భావించినట్లు చెప్పింది. తనను గుర్తించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ.. చిన్న పొరబాటువల్ల దొరికిపోయిందని పోలీసులు వెల్లడించారు.ఇంత పెద్ద మోసం వెనుక మరెవరైనా ఉన్నారా? లేదా ఆమె ఒంటరిగా చేసిన చర్యలేనా? అన్న కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 11 రాష్ట్రాల పోలీస్‌ విభాగాలు మిగతా సమాచారాన్ని సేకరిస్తున్నాయి

Related Posts