YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఈ ఆవు 10 లక్షలు

ఈ ఆవు 10 లక్షలు

అనంతపురం, జూన్ 25, 
ఐదు వేలు కాదు.. పదివేలు కాదు.. ఓ ఆవు ఏకంగా లక్షల్లో పలికింది. అది కూడా 10 లక్షల రూపాయలు పలికింది. నిజంగా ఆశ్చర్యపోతున్నారు కదా.. ఇది ముమ్మాటికీ నిజం. ఆవు ఏంటి? అంత ధర పలకడం ఏంటి? అనేది కదా మీ ప్రశ్న. ఆ ఆవు చాలా ప్రత్యేకం. రెండు పూటలా ఎక్కువగా పాలిస్తుంది. అందుకే ఆ ఆవుకు అంతటి డిమాండ్. ఇంతకీ ఆ ఆవు ఎక్కడ ఉందంటే శ్రీ సత్య సాయి జిల్లాలోని పెనుగొండలో. అక్కడ అమిత్ కిసాన్ హెబ్బేవ్ గోశాల నిర్వహిస్తున్నారు. ఆయన యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురం లో ఉన్న భూమి రామిరెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో అరుదైన జాతి ఆవును కొనుగోలు చేశారు అమిత్ కిషన్.ఈ ఆవు భారీగా పాలు ఇస్తుంది. రోజుకు 16 లీటర్ల పాలు ఇస్తుందని చెబుతున్నారు.  ఈ ఆవును యాదాద్రి జిల్లా నుంచి వాహనంలో పెనుగొండకు తీసుకొచ్చారు. రామిరెడ్డి నాలుగున్నర ఏళ్ల కిందట గుజరాత్ లోని రాజ్కోట్ నుంచి గిర్ జాతి ఆవులను రెండింటిని తెప్పించారు. యాదాద్రి జిల్లాలో గో శాలను ప్రారంభించారు. రెండు ఆవులతో ప్రారంభమైన ఆ గోశాలలో ఇప్పుడు 132 గిర్ ఆవులు ఉన్నాయి. ఈ జాతి ఆవులకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ ఆవుల చర్మం ఎరుపు రంగులో ఉంటుంది. కొన్ని ఆవులు నలుపు, తెలుపు, ఓల్డ్ కలర్ లలో కూడా ఉంటాయి. 400 కిలోల వరకు బరువు ఉంటుంది. ఈ ఆవుల చెవులు పొడవుగా ఉంటాయి. రోజుకు 10 నుంచి 20 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. మరికొన్ని ఆవులైతే 28 లీటర్ల వరకు పాలు ఇస్తాయి.మరోవైపు ఈ పాలు చాలా శ్రేష్టమైనవన్నీ నిపుణులు చెబుతుంటారు. ఈ ఆవులు అత్యధిక ఉష్ణోగ్రతలను( కూడా తట్టుకుంటాయి. చాలావరకు సాధుస్వభావంతో ఉంటాయి. ఎక్కడి వాతావరణం అయినా తట్టుకోగలవు. అందుకే ఈ ఆవులకు ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ఆదరణ ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో సంప్రదాయ పశు రైతులుకు ఈ ఆవులు ఎంతో శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. పశుసంవర్ధక శాఖ అధికారులు సైతం ఈ ఆవుల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు.

Related Posts