YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీ పోలీసులకు , ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ !

ఏపీ పోలీసులకు , ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ !

అమరావతి
రెంటపాళ్ల పర్యటన కేసులో  వైఎస్ జగన్  దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కారు ప్రమాదం జరిగితే.. కారులో ఉన్నవాళ్లపై కేసు ఎలా పెడతారు? అంటూ పోలీసులను నిలదీసింది. కారు ప్రమాదం జరిగితే కారులో ఉన్నవాళ్లపై ఎలా కేసు పెడతారు?. ప్రమాదానికి ప్రయాణికులను ఎలా బాధ్యుల్ని చేస్తారు?. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కుంభమేళాలో తొక్కిసలాట ఘటన జరిగింది కదా ? అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వ లాయర్ మరింత గడువు కోరగా.. తదుపరి విచారణను మంగళవారానికి(జులై 1వ తేదీకి) వాయిదా వేసింది. అప్పటిదాకా నిందితులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

Related Posts