YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జనవరి నుంచి మరో 62 అన్న క్యాంటిన్లు

జనవరి నుంచి మరో 62 అన్న క్యాంటిన్లు

కాకినాడ, జూలై 8, 
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్‌లపై ప్రజల్లో పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. అందుకే దీన్ని ప్రతి అసెంబ్లీ నియోజవర్గంలో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే దాదాపు 113 నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు ఉన్నాయి. ఇప్పుడు మిగతా 62 నియోజకవర్గాల్లో క్యాంటీన్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే జనవరి నాటికి ప్రతి నియోజకవర్గంలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం బిల్డింగ్‌లు నిర్మిస్తుంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ప్రక్రియ కూడా ప్రారంభించేశారు. ఈ భవనాలను డిసెంబర్‌కు పూర్తి చేసి జనవరిలో అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని చూస్తున్నారు. ఈ మేరకు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రూ.61 లక్షలతో ఒక్కో భవనం నిర్మిస్తున్నారు. అంటే ఇప్పుడు కొత్తగా నిర్మించే భవనాలకు ప్రభుత్వం రూ.41.70 కోట్లు ఖర్చు చేస్తుంది.   పేదలి ఆకలి తీర్చేందుకు ఈ అన్న క్యాంటీన్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 205 అన్న క్యాంటీన్‌లు ఉన్నాయి. వాటిలో 1,84,500 మంది ఫుడ్ తీంటున్నారు. దీనిపై ప్రభుత్వం నెలకు రూ.11 కోట్లు ఖర్చు చేస్తోంది. అంటే ఏడాదికి రూ.132 కోట్లు వెచ్చిస్తోంది. అన్న క్యాంటీన్‌లలో ఐదు రూపాయలకే అన్నం పెట్టడంతో ఈ క్యాంటీన్లు ప్రజాదరణ పొందాయి. ఉదయం టిఫిన్ మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం కూడా పెడుతున్నారు. ఇలా ఫుడ్ పెట్టేందుకు టిఫిన్‌పై 17 రూపాయలు, మధ్యాహ్నం, రాత్రి భోజనంపై చెరో 29 రూపాయలు ఖర్చు చేస్తోంది. మొత్తంగా ఒక వ్యక్తి అన్న క్యాంటీన్‌లో మూడు పూటల భోజనం చేస్తే ఆ వ్యక్తిపై 75రూపాయలు ఖర్చు పెడుతున్నందన్నమాట. క్వాలిటీ ఫుడ్‌ ఐదు రూపాయలకే పెడుతుండటంతో నియోజక వర్గస్థాయిలో పెడితే మంచిందనే ఆలోచన ప్రజల్లో వచ్చింది. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన చంద్రబాబు 70 అన్న క్యాంటీన్‌లు ఏర్పాటుకు ఓకే చెప్పారు. ఇప్పుడు ఉన్నవి ఎక్కువ పట్టణ, నగర ప్రాంతాలకే పరిమితం అయ్యాయి. అందుకే ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో క్యాంటీన్ ఉండేలా సర్దుబాటు చేస్తున్నారు. కొత్తగా మరో 62 నిర్మిస్తున్నారు. వాటిని జనవరిలో ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు. 

Related Posts