
న్యూ ఢిల్లీ
కేంద్ర ఎన్నికల సంఘం తీసుకువస్తున్న సంస్కరణలపై పలు కీలకమైన సూచనలని తెలుగుదేశం పార్టీ చేసింది. ఈసీతో మంగళవారంఆరుగురు సభ్యుల టీడీపీ బృందం ఢిల్లీలో భేటీ అయింది. టీడీఎల్పీ నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు నేతృత్వంలో ఈసీ అధికారులని టీడీపీ నేతలు కలిశారు. టీడీపీ బృందంలో ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎంపీలు దగ్గుమళ్ల ప్రసాదరావు, బైరెడ్డి శబరి, నేతలు కూన రవికుమార్, జ్యోత్స్న ఉన్నారు.కేంద్ర ఎన్నికల సంఘానికి ఓ లేఖను టీడీపీ బృందం అందజేసింది. ఈవీఎంలపై ఓటర్ల జాబితా పరంగా టీడీపీ నేతలు కీలక సూచనలు చేశారు. సీజీఏ (CAG) ఆధ్వర్యంలో వార్షిక తృతీయ పక్ష ఆడిట్ నిర్వహించింది. పార్టీలు, ఎన్నికల విధానాల్లో మార్పులతో పాటు పలు అంశాలపై చర్చించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలతో అన్ని పార్టీల సూచనలు తీసుకుంటున్నామని ఈసీ తెలిపింది. బీహార్‌లో ఈసీ సంస్కరణలను టీడీపీ బృందం స్వాగతించింది. గంట సేపు కేంద్ర ఎన్నికల కమిషనర్‌లతో టీడీపీ నేతలు చర్చించారు. ఆగస్టు - జనవరి మధ్య ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ జరుగనుందని సీఈసీ తెలిపారు. ఓటర్ల జాబితా పారదర్శకంగా రూపొందించాలని లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. అపోహలకు చోటులేకుండా సంస్కరణలు అమలుచేయాలని సూచించారు. ప్రత్యేక యాప్ ద్వారా ఓటరు జాబితా సవరణ చేయాలని శ్రీకృష్ణదేవరాయలు కోరారు.