
మల్కాజిగిరి
మల్కాజిగిరి రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. మంగళవారం అల్వాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య జరిగిన గొడవల ప్రభావం మల్కాజిగిరి వరకు వెళ్ళింది. దీనివల్ల ఇరు పార్టీల నేతలు పరస్పరం సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. "దమ్ముంటే మల్కాజిగిరి రా" అంటూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకులకు సవాల్ చేశారు. ఈ సవాల్ను స్వీకరించిన కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ సహా పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున మల్కాజిగిరి చౌరస్తాకు చేరుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి ఇరుపార్టీల వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ కాంగ్రెస్ నాయకులు మల్కాజిగిరిలోని ఆనంద్బాగ్ లో ఉన్న తమ పార్టీ కార్యాలయంలో తిష్టవేశారు. ఈ ఘటనల నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎప్పుడైనా ఏమయిపోతుందో అన్న భయం అందరిలో కనిపించింది..