YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సేమ్ సీన్... ఆల్ పార్టీస్

సేమ్ సీన్... ఆల్ పార్టీస్

హైదరాబాద్, జూలై 16, 
తెలంగాణలోని ఏదైనా గ్రామంలోకి వెళ్లి కాంగ్రెసోళ్ల గురించి అడిగితే తిడుతున్నారు. మరి బీఆర్ఎస్ సంగతేంది అంటే మద్దతుగానూ మాట్లాడడం లేదు. అసలు బీజేపీని పట్టించుకోవడం లేదు. ఇలాంటి దృశ్యం తెలంగాణలో ఎప్పుడూ లేదు. ఏదో ఒక పార్టీకి వెన్నుదన్నుగా ఉండేవారు ఇక్కడి వారు. కానీ ఎందుకో ఇప్పుడు మూడు ప్రధాన పార్టీల విషయంలో జనాల్లో విముఖత స్పష్టంగా కనిపిస్తోంది. కొత్త శక్తులు, పార్టీలు వచ్చే స్కోపు లేదు. సో ఈ మూడింటిలోనే ఒకదాన్ని ఎంచుకోవాల్సిన పరిస్థితి. ప్రస్తుతానికి ఏ పార్టీకి కూడా అంతగా ఎడ్జ్ లేని వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.తెలంగాణ ప్రజల తీర్పు ఖచ్చితంగా ఉండేది.. అనాదిగా ట్రాక్ రికార్డ్ చూస్తే ఏదో ఒక పార్టీకి పట్టం కట్టేవారు. క్లియర్ కట్ మెజార్టీ అయితే ఈ ప్రాంతంలో వచ్చేది. ప్రజలు సూటిగా సుత్తిలేకుండా ఆలోచించేవారు. అయితే తెలంగాణలో పార్టీలు ఎక్కువయ్యాయి. మంది ఎక్కవైతే మజ్జిగ పలుచన అయినట్టు.. జనాలు మారిపోయారు. మూడు పెద్ద పార్టీలు.. మధ్యలో చిన్నా చితక పార్టీలతో మొత్తం కలగపులగంగా తయారైంది.తెలంగాణలో బరువుకు మించి హామీలతో గద్దెనెక్కింది కాంగ్రెస్ సర్కార్. రేవంత్, నేతల దూకుడుతో.. బోలెడంత సంక్షేమం, అభివృద్ధి, వేలకు వేలు అకౌంట్లో పడిపోతాయిన జనం భ్రమించి ఓటేశారు. కానీ తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని.. కేసీఆర్ అప్పుల పాలు చేశాడని రేవంత్ జరుపుకుంటూ వచ్చేశారు. మొత్తానికి కిందా మీదా పడి డబ్బులు సర్దుకుంటూ సంక్షేమం పంచుతున్నా.. కొందరికి పడుతూ.. మరికొందరికి పడక వ్యతిరేకత అయితే బాగా స్ప్రెడ్ అవుతోందని క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి అర్థమవుతోంది. ఎవరినీ అడిగినా కాంగ్రెస్ గురించి ప్రస్తుతానికి పాజిటివ్ గా స్పందించడం లేదు..మరి ఈ వ్యతిరేకత బీఆర్ఎస్ పై పాజిటివ్ గా మారుతుందా అంటే అదీ లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కేసీఆర్ ప్రజలు, ప్రజాప్రతినిధులకు దూరంగా పాలించారు. జనాలకు డైరెక్టుగా కనెక్ట్ కాలేకపోయారు. కొన్ని పథకాలు, సంక్షేమం బాగానే ఉన్నా.. బీఆర్ఎస్ నేతలు జనంలోకి రాకపోవడం వారిపై వ్యతిరేకతకు కారణమైంది. కాంగ్రెసోళ్లు మొత్తం జనాల్లోనే ఉండడం.. తెలంగాణ పట్టణ జనాభా కంటే గ్రామీణ జనాభా మొత్తం కాంగ్రెస్ వెంట నడిచింది. అసలు గ్రామాల్లోకి వెళ్లని బీఆర్ఎస్ ఓడిపోయింది. ఎమ్మెల్యే సీట్లు అన్నీ కూడా కాంగ్రెస్ రూరల్ లోనే గెలిచింది. బీఆర్ఎస్ ఎప్పుడైతే జనానికి దూరమైందో అదే వారి ఓటమికి కారణమైంది. ఇప్పటికీ కాంగ్రెస్ ను తిడుతున్నా.. బీఆర్ఎస్ నేతలు జనంలోకి రారు.. రాలేరు అన్న అపప్రదతో ఆ పార్టీకి మనస్ఫూర్తిగా జనాలు అనుకూలత చూపించడం లేదు..మరి బీజేపీది మరో కథ.. రెండేళ్లకోసారి అధ్యక్షుడిని మారుస్తూ ఏ బీజేపీ నేత ఎప్పుడు ఉంటారో.. ఎవరు నడిపిస్తారో.. అసలు నడిపిస్తామన్న వారికి అధ్యక్ష పీఠం ఎందుకు ఇవ్వరో అర్థం కాని పరిస్థితి. ఒక బలమైన నాయకుడిని ఎదగనీయకుండా కేంద్ర బీజేపీ నాయకత్వం తెలంగాణలో అసలు ఎలాంటి స్ట్రాటజీని అమలు చేస్తుందో బీజేపీ రాష్ట్ర నేతలకు కూడా అర్థం కాని పరిస్తితి. రాజాసింగ్ లాంటి నేతలు దీనిపై నిలదీస్తే ‘గెట్ అవుట్’ అంటూ గెంటించేస్తున్నారు.  తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో పట్టుమని పాతిక నియోజకవర్గాలకు కూడా బలమైన నేతలు, క్యాడర్ లేదు. ఇదే బీజేపీని తెలంగాణకు దూరం చేస్తోంది. సోదిలో లేకుండా చేస్తోంది..ఏతావాతా చెప్పొచ్చేది ఏంటయ్యా అంటే.. తెలంగాణలో ప్రస్తుతం ఏ పార్టీని చూసినా ఏమున్నాది గర్వకారణం అన్నట్టుగా ఉంది.

Related Posts