YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చిత్తూరు అభివృద్ధి మంత్రం...

చిత్తూరు అభివృద్ధి మంత్రం...

తిరుపతి, జూలై 18, 
చిత్తూరు జిల్లా రాజకీయ ముఖచిత్రం ఏంటి? ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ గా ఉండడానికి కారణం ఏంటి? మంచి విజయం సాధించిన టిడిపి కూటమి తన మార్కు చూపించడం లేదు ఎందుకు? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి రోజా వంటి వారు యాక్టివ్ గా ఉన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవసరమైన ప్రతిసారి వారు బయటకు వస్తున్నారు. గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నారు. అయితే వారిని నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందా అన్న ప్రశ్న వినిపిస్తోంది. అయితే చిత్తూరు జిల్లా నాయకుల తీరు ప్రత్యేకం. వారు జగన్మోహన్ రెడ్డికి హార్డ్ కోర్ ఫ్యాన్స్. అందుకే అంతగా యాక్టివ్ గా ఉంటున్నారు.గత ఎన్నికల ఫలితాల తర్వాత చాలా జిల్లాల్లో వైయస్సార్ కాంగ్రెస్ వాయిస్ వినిపించడం లేదు. శ్రీకాకుళం,,విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు వంటి జిల్లాల్లో పూర్తిగా వైసిపి నేతలు సైలెంట్ అయ్యారు. బయటకు కూడా రావడం లేదు. కానీ చిత్తూరు జిల్లాలో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ వైసిపి నాయకులు చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఇటీవల జగన్ జిల్లాలో పర్యటించిన సమయంలో మొత్తం నేతలంతా ఏకతాటి పైకి వచ్చారు. అయితే సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో ఆయనకు భయపడకుండా వైసిపి నేతలు గట్టి రాజకీయమే చేస్తున్నారు.చిత్తూరు జిల్లాలో బలమైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డివర్గం ఉంది. ఆయన రాయలసీమనే శాసించారు. కుప్పంలో చంద్రబాబును ఓడించాలని ప్రయత్నం చేశారు. అంతెందుకు హిందూపురం లాంటి టిడిపి కంచుకోటలో వైసీపీకి మరల్చాలని భావించారు. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి ఎమ్మెల్యే గాను, కుమారుడు మిధున్ రెడ్డి రాజంపేట ఎంపీ గాను ఉన్నారు. దీంతో వారిని నియంత్రించాలన్న ప్రయత్నాలలో కూటమి ప్రభుత్వం ఉంది. కానీ అదేది సాధ్యం కాకపోతోంది. జగన్ అభిమాన నాయకులు ఈ జిల్లాలో అధికం. అందుకే వైసిపి నేతలను నిలువరించలేకపోతున్నారన్నది నిజం.పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి చిత్తూరు జిల్లాలో మార్పు తీసుకురావాలన్నది చంద్రబాబులక్ష్యంగా కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో సైతం చిత్తూరు జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముద్ర చాటుకుంది. మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. 2019లో అయితే ఒక్క కుప్పం మాత్రమే టిడిపి గెలుచుకుంది. 2024 ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారింది. కానీ కూటమి ప్రభంజనంలో సైతం పెద్దిరెడ్డి కుటుంబం హవా చాటుకుంది. ఆ కుటుంబం నుంచి ముగ్గురు గెలిచారు. ఆ ముగ్గురితోనే జగన్ రాజకీయం నడిపిస్తున్నారు. కానీ చిత్తూరు జిల్లాను తన అదుపులోకి తెచ్చుకునే క్రమంలో చంద్రబాబు విప్లమవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. మరి దానిని ఆయన ఎలా అధిగమిస్తారో చూడాలి..

Related Posts