
తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్, నయనతార ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడ్తున్నాయి. ప్రస్తుతం విగ్నేష్ శివన్ దర్శకత్వంలో నయనతార ఒక హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేయబోతుందంట. ఈ సినిమాని తానే నిర్మించడానికి నయనతార అంగీకరించినట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రియుడి దర్శకత్వంలో గతంలో నయన్ 'నానుమ్ రౌడీ ధన్ ' అనే తమిళ చిత్రంలో నటించింది.