YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఇవాళ్టి నుంచి సభా సమరం అవిశ్వాసానికి టీడీపీ సమాయాత్తం

ఇవాళ్టి నుంచి సభా సమరం అవిశ్వాసానికి టీడీపీ సమాయాత్తం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వేడిగా వాడిగా బుధవారం నుంచి నుంచి ఆరంభం కానున్నాయి. తలాక్ బిల్లుతో పాటు పలు కీలక బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో సభలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే ప్రభుత్వ వర్గాలు ప్రతిపక్ష నేతలతో సమావేశం అయ్యాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి విజయ్ గోయల్ సోమవారం ప్రత్యేకంగా టిఆర్‌స్, సమాజ్‌వాది పార్టీ, బిఎస్‌పి, శివసేన , సిపిఐ, బిజెడి ఇతర పార్టీల పార్లమెంటరీ పార్టీ స్థాయి నేతలతో సమావేశం జరిపారు. లోక్‌సభ, రాజ్యసభలు సజావుగా సాగడంలో ప్రతిపక్షాల నుంచి సముచితమైన సహకారాన్ని మంత్రి అభ్యర్థించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతకు ముందు మంత్రి విడిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కలిశారు. బుధవారం నుంచి జరిగే పార్లమెంట్ సెషన్ విజయవంతం కావాలని , ఇందుకు ప్రతిపక్షంగా కాంగ్రెస్ సహకారం కావాలని కోరారు. పార్లమెంట్ సెషన్ నేపథ్యంలో మంగళవారం ప్రభుత్వం అఖిలపక్ష నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగానే ప్రతిపక్షాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు, వివిధ అంశాలపై వారి వైఖరిని గ్రహించేందుకు ప్రయత్నిస్తారని వెల్లడించారు. వర్షాకాల సమావేశాలు బుధవారం నుంచి ఆరంభం అయి ఆగస్టు 10వ తేదీ వరకూ జరుగుతాయి. పార్లమెంట్ సజావుగా సాగేలా చేయడం అధికార , ప్రతిపక్షాల జాతీయ బాధ్యత అని, ఇందుకు అనుగుణంగానే అన్ని పక్షాలూ వ్యవహరించాల్సి ఉందని మంత్రి వారితో చెప్పినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జాతీయ ప్రయోజనాల కోణంలో కొన్ని బిల్లుల ఆమోదం అనివార్యం అని, ఈ దిశలో సహేతుక చర్చల ద్వారా సభలో వీటి మోదానికి అంతా పాటుపడాల్సి ఉందని సూచించారు. కొన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి. కొన్నింటిని తక్షణ ప్రజా శ్రేయస్సు కోణంలో ప్రవేశపెట్టనున్నాం, వీటికి అన్ని విధాలుగా సహకరించాలని మంత్రి కోరారు.మరో వైపు పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ మంగళవారం ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశమయ్యారు. సభలు సజావుగా సాగేలా వివిధ ప్రతిపక్ష పార్టీల సహకారం తీసుకోవాలని స్పీకర్ ఆనవాయితీగా ఈ సమావేశం ఖరారు చేశారు. ట్రిపుల్ తలాక్ వంటి పలు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక పార్లమెంట్‌లో తమ ఆచరణాత్మక వ్యూహాన్ని ఖరారు చేసుకునేందుకు ప్రతిపక్ష పార్టీలు సమావేశం అయ్యాయి. పలు బిల్లులు …వీటిపై అనుసరించాల్సిన సంయుక్త వ్యూహం గురించి ఇందులో సమీక్షించుకున్నారు. రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి ఉమ్మడి అభ్యర్థిని పోటీకి దింపే అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది కాంగ్రెస్‌కు చెందిన సీనియర్ నేత పిజె కురియన్ రాజ్యసభ ఉపాధ్యక్ష పదవీ కాలపరిమితి జూలై 1న ముగిసింది. దీనితో ఈ కీలక పదవికి ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేయాల్సి ఉంది. పార్లమెంట్ హౌజ్‌లోని ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ కార్యాలయంలో ప్రతిపక్ష నాయకులు భేటీ అయ్యారు.

Related Posts