YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు కళలు

పాట పుట్టిన రోజు..

పాట పుట్టిన రోజు..

- .నేడు వేటూరి జన్మదినం...

- వేణువై వచ్చాడు భువనానికి..

- పాటల పూ దోటలో అలుపెరుగని బాటసారి..మన వేటూరి..

తూర్పు కొండల... తొలితొలి సంధ్యల ...వేకువ పుష్పం వికసిస్తుంది...మన హృదయాలను వెలిగిస్తుంది....కొత్త పూల నెత్తావిలా తాకింది ఈ గీతం. ఆత్రేయ పాటల మత్తులో గమ్మత్తుగా జోగుతున్న కాలం అది. ఎవరిదీ కలం...కొత్త గళం..?

తెల్లవారుజాము చలిలో ...భోగి మంట వె్చ్చదనాన్ని ఆస్వాదిస్తూ...మా ఇంటి పక్కన ఉండే బ్యాంకు రాజు గారు మొదటిసారి సిరిసిరి మువ్వ పాటల గొప్పదనం గురించి చెప్పగా విన్నట్టు గుర్తు. ఆకాశమై పొంగె ఆవేశం... కైలాసమే వంగె నీ కోసం...పదలాలిత్యం మనసున ముద్ర వేసింది. ఆ సినిమాలోని ప్రతి పాట ఆణిముత్యమే..

. సై అంది పాదం కాదు..తెలుగు పదం... కొత్త పథం! ఆత్రేయ- నేనొక ప్రేమ పిపాసిని...నువ్వొక ఆశ్రమ వాసిని అని రాస్తే....తనకు ఇష్టమైన పాట అని చెప్పిన వేటూరి గారు ఆ తరువాత పంతలమ్మ చిత్రంలో సిరిమల్లె నీవే----విరిజల్లు కావే అంటూ ఆ పాటతో పోటీపడే అద్భతమైన పాట రాశారు. ఎలమావి తోట మారాకు వేసే ...మా రాకు వేసే....నీ రాక కోసం ...ఇలా సాగుతుందీ పాట. 
ఆషాడమాసంలో----.. ఆకాశంలో మేఘమాలికలు సహజమే---అందరూ చూసేదే--కానీ,, ఒక్క కాళిదాసు కే మేఘసందేశం రాసే ఆలోచన తట్టింది. మేఘసందేశం సినిమాలో  ఆకాశదేశాన అంటూ వేటూరి రాసిన పాటకు అందటి గౌరవం దగ్గింది. పాటల్లో ప్రయోగాలు. అలవోకగా చేసేవారాయన. వయ్యారి గోదారమ్మా...పాటలో కాబోలు కలవరం....కల-వరం ప్రయోగం అలరిస్తంది. అరి పదాన పుట్టావంటే గంగమ్మ--శ్రీ హరి పదాన పుట్టావంటే గంగమ్మ---శుభ సంకల్పంలోని పాట ఇది.భక్త కన్నప్పలో మారేడు నీవని--- ఏరేరితేనా మారేడు దళములు నీ పూజకు ...ఇలాంటివి మచ్చుకు కొన్ని. ఆరేసు కోబోయి పారేసు కున్నాను...హరి..హరి....ఓలమ్మి తిక్కరేగిందా అంటూ దుమ్మురేపిన పాటలు ఆయన కలం నుంచి జాలురారాయి.
పాత్రికేయుడిగా కూడ తెలుగు నాట వేటూరి ముద్ర చెరగనిది. శ్రీ శైలం ప్రాజెక్టు ప్రారంభంలో నాటి ప్రధాని నెహ్రు ప్రసంగాన్ని రిపోర్టు చేసిన కలం యోధుడు ఆయన. అదిగో ద్వారక... ఆలమందలవిగో---అంటూ రాసిన అసంబ్లీ కవరేజ్ వంటివి భావి జర్నలిస్టులకు సిలబస్ లాంటివి.

.

Related Posts