YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఎట్టకేలకు మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు ‘బంగ్లా’ గా నామకరణం చేస్తూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

ఎట్టకేలకు మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు     ‘బంగ్లా’ గా నామకరణం చేస్తూ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం
ఎట్టకేలకు పశ్చిమ బెంగాల్ పేరు మారనుంది. రాష్ట్రానికి బంగ్లా గా నామకరణం చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కాగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాతే కొత్తపేరు అమల్లోకి రానుంది. ఈ ప్రతిపాదనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని నెలలుగా తర్జన భర్జన జరుగుతూ వస్తోంది. పశ్చిమ బెంగాల్ పేరును ఇంగ్లీష్‌లో బెంగాల్ గానూ, బెంగాలీలోబంగ్లాగాను మార్చాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను తొలుత కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. అనంతరం సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వం రాష్ట్రం పేరును బెంగాలీ హిందీ ఇంగ్లీష్‌ భాషల్లో బంగ్లా గా మార్పు చేస్తూ మరో ప్రతిపాదన పంపినట్టు మొన్నామధ్య రాష్ట్ర విద్యాశాఖమంత్రి పార్థా చటర్జీ వెల్లడించారు.కాగా ఇంతకు ముందు కూడా రాష్ట్రం పేరును పశ్చిమ్ బంగోగా మార్చాలన్న ప్రతిపాదనను కేంద్రం తిరస్కరించడంతో... 2011లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం బెంగాల్ గా మార్చాలంటూ మరోసారి ప్రతిపాదన పంపినా ప్రయోజనం దక్కలేదు. పశ్చిమ బెంగాల్ పేరు ఇంగ్లీష్‌లో డబ్ల్యూ తో (వెస్ట్ బెంగాల్) మొదలవుతుండడంతో... ఎప్పుడైనా అఖిల రాష్ట్రాల సమావేశం జరిగినప్పుడు అన్ని రాష్ట్రాల కంటే ఆ రాష్ట్రం పేరు చిట్టచివరన వస్తోంది. అక్షర క్రమంలో రాష్ట్రాల జాబితా తయారు చేసేటప్పుడు అన్నిటి కంటే చివరన ఉండాల్సిరావడంతో పేరు మార్చాలని పశ్చిమబెంగాల్ పట్టుపడుతోంది.

Related Posts