YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అక్షరానికి వారిచ్చే మర్యాద అది..

అక్షరానికి వారిచ్చే మర్యాద అది..

మీరు నాకు పుస్తకాలివ్వండి. కానీ ఒక షరతు… ఉచితంగా మాత్రం వద్దు. ఎందుకంటే పుస్తకాలు రాయడం, వేయడం వెనుక ఎన్ని బాధలుంటాయో నాకు తెలుసు. రచయితలు బతకాలంటే వారి పుస్తకాలను కొని తీరాలి. న్యూయార్క్‌టైమ్స్‌ పత్రికలో పాఠకులు రాసిన లేఖకు కూడా పారితోషికం ఇస్తారు. అక్షరానికి వారిచ్చే మర్యాద అది. ” అన్నారు పరకాల ప్రభాకర్‌,
చిత్తూరు జిల్లాలో పేదల బతుకులకు కొత్త దారి చూపుతున్న ఒక గ్రామీణ బ్యాంకు పై నేను రాసిన పుస్తకాన్ని ఆయన ఆసక్తిగా చూశారు.
రూరల్‌మీడియాలో వచ్చిన ఆయన ఆర్టికల్‌ని గుర్తు చేసు కున్నారు.
కొత్తరాజధాని పై సూచనలు అడిగారు. దాదాపు అరగంట సేపు మా సమావేశం జరిగింది.
ప్రభుత్వంలో కీలకమైన పదవిలో ఉండి,ఎంతో ఎత్తుకు ఎదిగినా, కింద ఉన్న ప్రజల భవిష్యత్‌ గురించి వినయంగా,నిజాయితీగా పరకాల ప్రభాకర్‌ గారు ఆలోచించడం నన్ను విస్మయ పరిచింది.

Related Posts