YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగానికి సవరణ చేయాల్సిందే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓంప్రకాశ్ రావత్

జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగానికి సవరణ చేయాల్సిందే             చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓంప్రకాశ్ రావత్
జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో భావిస్తున్నది. లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటూ వన్ నేషన్.. వన్ ఎలక్షన్ నినాదాన్ని తెరపైకి తెచ్చింది. అయితే దీనిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కాగామొత్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే మాత్రం రాజ్యాంగానికి సవరణ చేయాల్సి ఉంటుంది. లేదంటే అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు సరిపడా సిబ్బంది, భద్రత, వీవీప్యాట్ మెషీన్లు ఇస్తే ఎన్నికలు నిర్వహించడం సాధ్యమేనని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓంప్రకాశ్ రావత్ అన్నారు. దీంతో కనీసం వచ్చే లోక్‌సభ ఎన్నికలతోపాటు 11 రాష్ర్టాల్లో అయినా ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కార్ చూస్తున్నది. ఇప్పటికే న్యాయాశాఖకు లేఖ కూడా రాసింది. వచ్చే ఏడాది తెలంగాణాతోపాటు ఒడిశా,ఆంధ్రప్రదేశ్‌లకు లోక్‌సభతోపాటు ఎన్నికలు జరగాల్సి ఉంది.టికితోడురాజస్థాన్,మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, హర్యానా, మహారాష్ట్ర, మిజోరం,జార్ఖండ్, బీహార్‌లలోనూ ఎన్నికలు నిర్వహించాలన్నది బీజేపీ ప్లాన్. నిజానికి వీటిలో రాజస్థాన్,మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్,మిజోరంలకు ఈ ఏడాది డిసెంబర్‌లోనే ఎన్నికలు జరగాల్సి ఉంది.వీటిని కాస్త ఆలస్యం చేయడంతోపాటు హర్యానా, జార్ఖండ్, బీహార్‌ల ఎన్నికలకు కాస్త ముందుకు జరపాలని చూస్తున్నారు. నాలుగు రాష్ర్టాల్లో ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన.. మిగతా రాష్ర్టాల్లో అసెంబ్లీని ముందుగానే రద్దు చేయడం వల్ల ఇది సాధ్యమవుతుంది. జార్ఖండ్,మహారాష్ట్రలలో వచ్చే ఏడాది డిసెంబర్‌లో, బీహార్‌లో 2020లో ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో బీజేపీ లేదా బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి.. అసెంబ్లీని ముందుగానే రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. 

Related Posts