YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

జగన్ పార్టీ వైపు పురందరేశ్వరీ అడుగులంటూ ప్రచారం

 జగన్ పార్టీ వైపు పురందరేశ్వరీ అడుగులంటూ ప్రచారం

ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలువురు రాజకీయ నేతలు తమ భవిష్యత్ కోసం ఆరాటపడుతున్నారు. ఇప్పుడున్న పార్టీ నుంచి బరిలోకి దిగితే ప్రజలు ఆదరిస్తారా? లేదా? ఇతర పార్టీల్లోకి వెళ్తే గెలిచే అవకాశాలు ఎలా ఉంటాయని ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారు. దీనిలో భాగంగానే ప్రస్తుతం బిజేపీలో ఉన్న ఒక మాజీ కేంద్రమంత్రి వైసిపీ జాయిన్ అవుతారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అక్కడికి వెళ్తే కొడుకు ఫ్యూచర్‌కు ఢోకా ఉండదని అనుకుంటున్నారట? ఇప్పుడు ఇదే న్యూస్ ఇంటర్నెట్‌లో హాల్ చల్ చేస్తుంది. ఆ కథేంటో మనం చూద్దాం పదండి.రాజకీయ నాయకులకు ఉన్న బెంగల్లా తమ వారసులను ఫీల్డ్‌లో సక్సస్‌ఫుల్‌గా నిలబెట్టడం. తమ లెగసీని, కార్యకర్తలను కాపాడుకోవడం. ఇప్పడు కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి అదే పనిలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్న ఎన్టీఆర్‌ కుమార్తెగా ఆమెకు ఆంధ్రప్రదేష్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది. తెలుగుదేశం నుంచి  బయటకి వచ్చాక కాంగ్రెస్‌లో పార్టీలో కొనసాగిన దగ్గుబాటి కుటుంబం అక్కడ మంచి పదవులను అనుభవించింది. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ ఇక్కడ ఫేఢ్ అవుట్ అవ్వడంతో టీడీపీలోకి వెళ్లడం కుదరక, వైసీపీలోకి వెళ్లలేక  మరో జాతీయ పార్టీ అయిన బిజేపీలో జాయిన్ అయింది పురందేశ్వరి. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ మోసం చేస్తే..ప్రత్కేక హోదా విషయంలో బిజేపీ నమ్మకం ద్రోహం చేసిందని ఏపీ ప్రజలు బలంగా నమ్మే పరిస్థితి ఏర్పడింది. అందుకే పురందేశ్వరి వైసిపీకి దగ్గరవుతున్నట్టు పొలిటికల్ వర్గాల వినికిడి. కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడు దగ్గుబాటి హితేష్ చెంచురామ్ ను కూడా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దించాలని భావిస్తున్నారట. అయితే ఆ ఎంట్రీ ఇప్పడు వారున్న పార్టీ బీజేపీ నుంచి కాదట..వైసీపిలోకి వెళ్లి పోటి చేయించాలనే ఆలోచనలో చిన్నమ్మ ఉన్నట్లు టాక్ వినిపిస్తుంది. అందుకు వారు ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం బెటర్‌ అని భావిస్తున్నారు. పర్చూరు నియోజక ప్రజలతో దగ్గబాటి కుటుంబానికి మంచి సంబంధాలే ఉన్నాయి. పురందేశ్వరి భర్త దగ్గుబాటి వేంకటేశ్వరరావు ఒకప్పుడు ఇక్కడి నుండే ప్రాతినిధ్యం వహించారు. 1989లో ఆయన టీడీపీ తరుపున పోటీ చేసి గెలిపొందారు. ఆ తర్వాత 2004లో కాంగ్రెస్ తరుపున పోటి చేసి విజయం సాధించారు. విభజన కారణంగా కీలక కాంగ్రెస్ నేతలంతా ఎన్నికలకు దూరమైనట్టే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా గెలుపు అనుమానంతో 2014 ఎన్నికల్లో పోటి చేయలేదు. దీంతో పర్చూరు నియోజకవర్గంలో టీడీపీకి చెందిన ఏలూరి సాంబశివరావు అక్కడి నుంచి విజయం సాధించారు. తాజాగా ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ పుంజుకుంటుంది అని వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో ఆ వైపు వెళ్లాలనుకుంటుదట పురందేశ్వరి. ఈ నేఫధ్యంలో 2019 ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలోకి దిగితే గెలవడం కష్టమని..కొడుకు హితీష్‌ను వైసీపీ నుంచి పర్చూరు బరిలో దింపుతారనే వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాదు విజయవాడ ఎంపీ టికేట్ ఇస్తే తాను కూడా వైసీపీ నుంచి పోటీ చేసేందుకు సంకేతాలిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.ఇదే విషయంపై క్లారిటీ కోసం బిజేపీ వర్గాలను సంప్రదించింది మహాన్యూస్ పొలిటికల్ బ్యూరో టీం. అయితే పురందేశ్వరికి అటువంటి ఆలోచనలు ఏమి లేవని..బీజేపీ జాతీయ మహిళా మెర్చా అధ్యక్షురాలుగా ఉన్న ఆవిడ వచ్చే ఎన్నికల్లో బిజేపీ నుంచే పోటీ చేస్తారని వారు క్లారిటీ ఇచ్చారు . సో ఇది ఫేక్ న్యూస్

Related Posts