YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

ఎన్టీఆర్‌ నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన బ్రహ్మణి..!!

ఎన్టీఆర్‌ నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన బ్రహ్మణి..!!

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఎన్టీఆర్‌ ట్రస్టు పనిచేస్తుందని హెరిటేజ్‌ ఫుడ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, ఆ ట్రస్టు నిర్వాహకురాలు నారా బ్రహ్మణి పేర్కొన్నారు. శ్రీసిటీ పారిశ్రామిక నగరంలో శనివారం శ్రీసిటీ ఛైర్మన్‌ శ్రీనిరాజు, ఎండీ రవీంద్రసన్నారెడ్డితో కలిసి ఎన్టీఆర్‌ నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇప్పటివరకు రెండు శిక్షణ కేంద్రాలు హైదరాబాద్‌, వినుకొండలో ఏర్పాటు చేసి నైపుణ్య అభివృద్ధిలో యువతకు శిక్షణ ఇప్పిస్తున్నామన్నారు. ప్రస్తుతం అతి పెద్ద పారిశ్రామికవాడ అయిన శ్రీసిటీలో మూడో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. 8వ తరగతి ఆపై చదువులు పూర్తి చేసిన వారికి వేర్‌హౌస్‌ ప్యాకేజింగ్‌, చరవాణుల అసెంబ్లింగ్‌ కోర్సులలో ఉచిత రెసిడెన్సియల్‌ శిక్షణ కల్పించనున్నట్లు చెప్పారు. హెరిటేజ్‌, సీఎస్‌ఆర్‌ నిధులతో శ్రీ టెక్నాలజీ సాంకేతిక భాగస్వామిగా శిక్షణ కేంద్రాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 2010 నుంచి ఇప్పటి వరకు 12 వేల మందికి ట్రస్టు ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించినట్లు ఆమె వివరించారు.

Related Posts