YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

ఆంధ్ర ప్రదేశ్

విశాఖలో భారీ సొర చేప దొరికింది..

 విశాఖలో  భారీ సొర చేప దొరికింది..

 - మత్స్యకారులు పండగా చేసుకున్నారు.. 

విశాఖపట్నం మండలంలోని రాజయ్యపేట మత్స్యకారులకు భారీ సొర చేప దొరికింది. శనివారం తెల్లవారుజామున గ్రామానికి చెందిన మత్స్యకారులు బోట్లపై సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వేట సాగిస్తుండగా ఈ భారీ సొర చేప లభించింది. సుమారు పది అడుగుల పొడవు కలిగిన ఈ చేప సుమారు 125 కిలోల బరువు ఉంది. దీని వెల దాదాపు రూ.లక్షకు పైగా వుంటుందని మత్స్యకారులు చెప్పారు.

ఈ సొర చేపను విక్రయించేందుకు ప్రత్యేక వాహనంలో కేరళ రాష్ర్టానికి తరలిస్తున్నామన్నారు. ఈ చేపను చూసేందుకు గ్రామస్థులు ఎగబడ్డారు.

Related Posts